టిక్ టాక్ తో కాలక్షేపం చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగిని

ఓ కార్పొరేషన్ సిబ్బంది విధుల్లో ప్రజా సమస్యలను పక్కనపెట్టి టిక్ టాక్ వీడియో లతో ఎంజాయ్ చేస్తున్నారు. ప్రజలకు సేవలు అందించాలనే సంకల్పం తో ప్రభుత్వాలు ఉద్యోగ నియామకాలు చేపట్టి జీవన ఉపాధి కల్పిస్తుంటే ఉపాధి ఎక్కువయి ప్రజల సమస్యలను పక్కన పెట్టి టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ కాలక్షేపం చేస్తూ కొంత మంది ఉద్యోగులు, ఉద్యోగుల స్థాయిని దిగజారుస్తున్నారు.

ఖమ్మం మున్సీపాలిటి నుంచి కార్పొరేషన్ గా అప్‌గ్రేడ్ అయినా నాటీ నుండి ఎన్నో సమస్యలో చిక్కుకొని వుంది. ఎక్కడి సమస్యలు అక్కడే వుండటం మూలాన అధికార యంత్రాంగం పై ప్రతి పక్ష వాగ్వాదానికి దిగుతున్నాయి అయిన కానీ అధికారుల తీరు మరకపోగా టిక్ టాక్ వీడియోలు చేసుకుంటూ మరింత ప్రజా గ్రహానికి గురవుతున్నారు. కార్పొరేషన్ విభాగాల్లో సానిటేషన్, రోడ్లు, డెత్, బర్త్ సర్టిఫికెట్ల కోసం జనం గగ్గోలు పెడుతుంటే సమయం లేదంటూ తిప్పుకుంటూ ఉద్యోగులు టిక్ టాక్ వీడియోలు చేయడానికి మాత్రం తీరిక సమయం ఎక్కడి నుంచి దొరుకుతుందని మండి పడుతున్నారు ప్రజలు. పనులు మానేసి టిక్ టాక్ వీడియోలు చేస్తున్నా సిబ్బంది పై ఉన్నత అధికాకులు కఠిన చర్యలు తీస్కోవాలని అంటున్నారు. ప్రజలు అవసరమైతే అవసరాలు వున్నా వారికీ కాకుండా రికమెండేషన్ తో ఉద్యోగులు పొందుతే ఇలాంటివే చూడాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం కార్పొరేషన్ లో ఔట్సోర్సింగ్ విభాగాల్లో పనిచేస్తున అనిత, జ్యోతి, రవిలకు ఇప్పటికే షోకాజ్ నోటీసులు జారీచేశారు. వీళ్లంతా బర్త్, డెత్ సర్టిఫికెట్లు, ట్రేడ్ లైసెన్సులు ఇచ్చే కీలక విభాగాల్లో పనిచేస్తున్నారు. ఈ వీడియోల్లో కంప్యూటర్ ఆపరేటర్ ప్రవీణ్, డీబీ సెక్షన్ అసిస్టెంట్ వీరన్న కూడా కనిపించడంతో వారిని కూాడా సంజాయిషీ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *